Monday, December 22, 2008

బావలు బావలు, హొయ్ హొయ్, రింబోల రింబోల రిమ్బోలా....

Sunday, December 21, 2008

తెలుగు బ్లాగర్లందరికీ ఈ వీడియో అంకితం. మీ షేక్.ఇలియాస్

తెలుగు బ్లాగర్లందరికీ ఈ వీడియో అంకితం. ఇది నా చిన్న ప్రయత్నం, ఈ వీడియో లో కొందరి బ్లాగ్స్ మాత్రమే పెట్టగాలిగ్యను, మీ బ్లాగ్లు కూడా వీడియో రూపం లో కనిపించాలని మీరు అసిస్తుంటే. దయచేసి మీ బ్లాగ్ ఫోటో పంపించండి. నాకు సాద్యం అయతే తప్పకుండ వీడియో లో జతపరుస్తాను. మీరు మీ బ్లాగ్ ఫోటో నా ఇమెయిల్ చిరునామాకి పంపించగలరు. నా ఇమెయిల్ చిరునామా elu2020@gmail.com ఈ వీడియో గురుంచి మీ అభిప్రాయాలూ తప్పకుండ తెలుపవలసిందిగా నా విన్నపం. మీ సహచర బ్లాగర్ షేక్.ఇలియాస్

Sunday, December 14, 2008

కుక్కలు రాజ్యాన్ని పాలిస్తే? వాటి వేషధారణ ఎలాఉంటుంది? చుడండి ఇక్కడ

కుక్కలు రాజ్యాన్ని పాలిస్తే? వాటి వేషధారణ ఎలాఉంటుంది? ఇదిగో పైవిధంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఉంహించడానికి చాల సరదాగా ఉంటుంది కదు? ఉంహించడమే కాదు దానికో ఉహరుపం ఇస్తే యంతబాగుంటుంది కదు? అదే ఇక్కడ మనం చూస్తున్నది. నాదగ్గర ఇలాంటి చిత్రాలు చాల ఉన్నయ్, ఇందులో కొన్ని ప్రస్తుతానికి పోస్ట్ చేస్తున్నాను, వారానికొకసారి తప్పకుండ ఇలాంటి వింత వింత చిత్రాలు పోస్ట్ చేస్తుఉంటాను. తప్పకుండ విక్చించండి. ఇక్కడ ఎక్కువ చిత్రాలు పోస్ట్ చేస్తే పేజి లోడ్ కావడానికి చాల సమయం పడుతుంది, అందుకని పేజి త్వరగా లోడ్ కావడానికి ఈ వింత చిత్రాలన్నీ ఇంకొక బ్లాగులో పెట్ట్యను, చుడండి మొత్తం ఇరవై వింత చిత్రాలు ఉన్నయ్ అందులో. ఇక్కడ వక చిత్రం మాత్రమే పెట్టి ఉన్నాను, మొత్తం వింత చిత్రాలు చూడడానికి ఇక్కడ నొక్కండి వింత చిత్రాలు . సరే ఉంటాను, త్వరలో ఇంకో టపాతో కలుద్దాం. అంతవరకు సెలవ్. మీ షేక్.ఇలియాస్

తెలుగు బ్లాగుల దినోత్సవం శుభాకాంక్షలు. మీ షైక్.ఇలియాస్

బ్లాగర్లకు దేశ విదేశాల్లో నా బ్లాగును చూస్తున్న తెలుగు వారందరికి "తెలుగు బ్లాగుల దినోత్సవం" సంధర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు.

ఆ రెండు రోజులు.

టీచర్: ఆంగ్లంలో 'టీ' అక్షరంతో ప్రారంభమయ్యే వారంలోని రెండో రోజుల పేర్లేంటి? వెంగళప్ప: టుడే, టుమారో. టీచర్:....!!!!???

Saturday, December 13, 2008

ధోని వేషంలో సునీల్.

కోలీవుడ్ నటుడు సునీల్ భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ వేషం వేస్తే ఎలా ఉంటారన్న ఊహకు ప్రతిరూపమే ఈ చిత్రం. ఈ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో టాలీవుడ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటోంది. భారతీయ హీరోల బయోగ్రఫి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాలేజీ ఫస్ట్ రావడమెలా?

కాలేజీ ఫస్ట్ రావాలన్న తపన ప్రతి విద్యార్థికి ఉంటుంది. అయితే దీన్ని సాధ్యం చేసుకోవడానికి ఈ ఐదు విజయ రహస్యాలను తెలుసుకోండి. వేకువజామున 4 గంటలకే నిద్రలేచి పళ్లు తోముకొని చిలిగా ఉన్నా స్థానం చేయండి. 5 గంటలకు అమ్మను నిద్రలేపండి. కాఫీ లేదా టీ ఇస్తారు తాగండి. 5.30 గంటలకు టీవీ పెట్టండి. ఏదో ఆథ్మాత్మిక కార్యక్రమాన్ని చూసి మనస్సును రిలాక్స్ చేసుకోండి. 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరండి. 5.6.30 గంటలకల్లా కాలేజీ చేరుకోవచ్చు. మీరే కాలేజీ ఫస్ట్. అర్థమయ్యిందా!!? భారతీయ హీరోల బయోగ్రఫి కోసం లింక్ క్లిక్ చేయండి

ఏమి చించాము?

(బ్రహ్మానందం సూక్తి) క్యాలెండర్‌లో తేదిని చించడం గొప్ప కాదు. చించిన తెదీలో మనము ఏమి చించామన్నదే ముఖ్యం.

పజిల్ రాయుడు

వెంగళప్ప స్నేహితుడు: వెంగళప్ప, ఏంటి ఇలా సంతోషంతో ఎగిరి గెంతులేస్తున్నావ్? వెంగళప్ప: ఈ మెగజైన్‌లోని పజిల్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశానోయ్. అందుకే... వెంగళప్ప స్నేహితుడు: నువ్వు ఎంత సమయం తీసుకొన్నావు? వెంగళప్ప: పజిల్ కింద "3 నుంచి 5 యేళ్లు' అని ఇచ్చారు. అయితే నేను కొన్ని నిమిషాలలోనే పూర్తిచేశా. వెంగళప్ప స్నేహితుడు:!!!!????

Wednesday, December 10, 2008

సినిమా దయ్యాలు. నవ్వుల కథ

ప్రొడ్యూసర్ 'గురువిందరావు' ఇప్పటికి నాలుగు సినిమాలు తీసాడు. అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆఖరి ప్రయత్నంగా తన దగ్గర మీగిలిన నాలుగు కోట్లతో ఇంకో సినిమా తీసి, గౌరవంగా ఫీల్డ్ నుంచి పరరైపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకూ తన సినిమాల్లో లవ్, క్రైమ్, సెంటిమెంట్, ఫ్యాక్షన్ లాంటి ఎలిమెంట్స్ అన్ని టచ్ చేసాడు కానీ ' హర్రర్ ' ఎలిమెంట్ ని టచ్ చేయలేదు. అదే ఆలోచనలో వంటరిగా బల్కానిలో ఫుల్ బాటిల్ ముందు కట్టేసిన గురువిందరావుకి గాల్లో కొన్ని ఆకరాలు తెలుగుపోతున్నట్ట్లుగా కనిపించాయ్. మందులో ఉన్నా ఆయనకు అవి మేఘాల ని తెలిలేదు. గ్లాసు తీసుకుందామని చేయి కిందకు పెడితే అక్కడ ! గ్లాసు లేదు. " నేనెప్పుడూ కుడిచేత్తోనే తగుతనే ! ఎడమచేతి దగ్గర ఉందేంటి గ్లాసు " అనుకుంటూ సిగరెట్ వెలిగించి అగ్గిపుల్లను కింద పడేసాడు. అది పడ్డచోట భగ్గున మంట వచ్చి ఆరిపోయింది. నో డౌట్.. ఇది ఈవిల్ పవర్ " అనుకున్నాడు. నిజానికి అగ్గిపుల్ల పడ్డచోట కొంత మందు వలికి ఉండడంతో మంట వచ్చిందన్న సంగతి అయన గ్రహించ లేదు. అంతలో తీతవు పిట్ట అరవడంతో 'హర్రర్ ' సినిమా తీయడానికి డిసైడ్ అయపోయాడు. ఓ దర్శకుడిని కలిసాడు. "మిస్టర్ గురువిందరావు ! నా డైరక్షన్ లో సినిమా తియడమంటే కందహార్ టెర్రరిస్ట్ లతో కబ్బడి ఆడుకున్నట్లే. బెడ్జేట్ అంటే లెక్క చేయనివాల్లె నాతో సాహసం చేస్తారు. పైగా సినిమా తెస్తున్న టైంలో ఎ దావూద్ ఇబ్రహీంలాంటివాడో చందా ఇమ్మని ఫోన్ చేస్తాడు. ఇవన్ని నువ్వు తట్టుకోలేవు. నీ బోడి బెడ్జేట్ కి నా అసిస్టెంట్లు లో తలమాసినోడొకడు సరిపోతాడు తిసుకోపో " అన్నాడాయన. అయన అసిస్టంట్ బృందం లో నిర్లక్షంగా, రెక్లేస్స్ గా ఉన్నా 'పోతురాజు' అనే కుర్రాడ్ని సెలెక్ట్ చేసుకున్నాడు గురువిందరావు. " మనం తెసేది హర్రర్ సినిమా కాబట్టి ఏదన్న స్మశానం పక్కన ఆఫీసు తియమన్నాడు" పోతురాజు. వెంటనే పంజ గుట్ట స్మశానం గోడకు అనుకోని నిర్మించిన భవనంలో ఆఫీసు తీసాడు ప్రొడ్యూసర్. పదమూడో తారీఖు, అమావాస్య, ఆదివారం రోజు అర్ధరాత్రి సమయంలో ఓ మాంత్రికుడితో కపాలం బద్దల కొట్టించి ( కొబ్బిరికాయ బదులు పాత కపాలం ) ఆఫీసులో దిగారు. ఆ రాత్రే కథ చెబుతానని ప్రొడ్యుసర్ని స్మశానంలోకి తీసుకొచ్చాడు పోతురాజు. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడని ప్రొడ్యూసర్ అగ్గి పెట్టె ఇవ్వబోయాడు. " మనం తీసేది హర్రర్ సినిమా సార్" అంటు పోతురాజు వెళ్లి అక్కడ కాలుతున్న చితి నిప్పులతో సిగరెట్ మంటించాడు. చలిగా ఉండటంతో ఇద్దరు శవం కాలుతున్న మంట దగ్గరే కూర్చున్నారు. పోతురాజు చెప్పే కథ వింటుంటే గురువిందరావుకి వెన్నులోంచి చలి పుట్టింది. " చిన్నపిల్లకు చేతబడి చేసారెవరో... ఆ పిల్ల తన తండ్రిని, తల్లిని పికపిసికి చంపేసింది. ఇక ఆ ఇంట్లో ఆరుగురు మిగిలారు " అని డిరెక్టర్ చెబుతుండగా కాలుతున్న శవానికి కపాల మొక్చమయ్యి దాని పుర్రె 'డాం' అని పగలిపోవడంతో నిప్పులు ఎగసి గురువిందరావు మీద పడ్డాయ్. "మిగితా కథ వినే ధైర్యం నాకు లేదు బాబూ! దయచేసి సినిమా ప్రారంబించేయ్" అని గురువిందరావు దణ్ణం పెట్టేశాడు. అమావాస్య రోజు షూటింగ్ ప్రారంభించారు. అరవై శాతం సినిమాని వివిధ స్మసనాల్లో పూర్తీ చేసారు. సమాదుల్లోంచి దెయ్యాలు వచ్చి బ్రేక్ డాన్స్ చేసినట్లుగా ఐటం సాంగ్ కూడా చేసారు. రీ-రికార్డింగ్ అయెతే ముంబై తెసుకెళ్ళి అరుపులు.కేకలతో చేఎంచుకోచ్చారు. ఫస్ట్ కాపి రెడి అయంది. ప్రివ్యూకి పిలిచినా ఎవ్వరూ భయపడి రారని... డైరెక్ట్ గా సినిమాని రిలీజ్ చేసేసారు. సినిమా రిలీజ్ అయ్యి రెండ్రోజులైన జనం పలుచగానే ఉన్నారు తప్ప హౌస్ ఫుల్ కావడం లేదు. సినిమా ఎలా ఉన్నా జనం రావాలంటే ప్రచారం కావాలి కాబట్టి " వంటరిగా మా సినిమా చుస్తే ఆరు lacks బహుమతి " అని ప్రకటించారు. ఆరో తరగతి చదివే ఓ కుర్రాడు సెకెండ్ షోని వంటరిగా, నవూతు చూసి ఆరు lacks పట్టుకోపోయాడు. ఆ కుర్రాడ్ని యందుకు భయపడలేదని అడిగితే " ఎముందంకుల్. నేను ఆడుకునే వీడియో గేమ్స్ లో యంత హర్రర్ ఉంటుందో మికేంతెలుసు ! దానికన్నా గొప్పదా మీ సినిమా " అన్నాడు వాడు. " మా సినిమా చూస్తున్నప్పుడు ధియేటర్ లో మీకు నిజంగా దెయ్యాలు కనబడతాయ్. మీ పక్కనుండే వేలతాయ్" అని ప్రచారం ఇచ్చి సినిమా హల్లో లైట్ లన్ని ఆర్పేసి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ దెయ్యాల వేశాలేసుకొని సడన్ గా జనం మధ్యకెళ్ళి భయపెట్టారు. ఇంటెర్వల్ తర్వాత చిన్న పిల్లలు గుండు సూదులు తెచ్చి దెయ్యాల పిర్రలమిద గుచ్చడంతో ఆ ప్రచారం మానుకున్నారు. సెకండ్ షో సినిమా చూస్తున్న ఆడియన్స్ తెల్ల చొక్కామీద ఇంక్ ఫిల్లర్స్ తో రెడ్ ఇంక్ తీసుకోని దొంగచాటుగా చల్లాడు గురువిందరావు. ఇంటెర్వల్ లో తమ చొక్కలమిద రక్తపు మరకలేంటి అని కొంత మంది కంగారు పడ్డారు. దాన్నే ప్రచారంగా వాడుకోవాలని.. ఇంటెర్వల్ తర్వాత ఇంక్ చల్లుతూ ఆడియన్స్ కి దొరకిపోయే తన్నులు తిన్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఇలా ధియేటర్ లో కాదు, బయట ఏదన్న చేసి సినిమా ఆడించాలని అర్థరాత్త్రుల్లు దెయ్యాల వేషాలతో ఆటోలో తిరుగుతూ బిక్షగాల్లకు కనపడ్డారు. " ఆటోల్లో తిరుగుతూన్న దెయ్యాలు " అని అని టీవీలో స్క్రోలింగ్ చూపించారు. దాంతో పోలీసులు నిఘా వేసి టాక్సీలో వస్తున్న దెయ్యలమిద కాల్పులు జరిపారు. " బుద్ది లేదా మీకు ! ప్రచారం కోసం ఇంత నుసేన్స్ చేస్తారా ? ఇంక నయం, మావాళ్ళు కారు టైర్ల మీదే కాల్పులు జరిపారు" అంటు ఇద్దర్ని తిట్టి పంపించేసాడు పోలీస్ ఆఫీసర్. వారం రోజుల్లో ఫ్లాప్ అని తేలడంతో సినిమాని ఎత్తేసారు. ఇక గురువిందరావు తన సొంతూరు పెంటపాడు వేల్లిపోయ్, తన సిమెంట్ గొట్టాల వ్యాపారాన్ని మళ్ళి ప్రారంబించాడు. గమనిక :ఈ కథ ఓ ప్రముఖ దినపత్రిక లోంచి సేకరించడం జరిగింది.