ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే చలా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను. - ప్రేమతో షేక్ ఇలియాస్
Saturday, December 13, 2008
కాలేజీ ఫస్ట్ రావడమెలా?
కాలేజీ ఫస్ట్ రావాలన్న తపన ప్రతి విద్యార్థికి ఉంటుంది. అయితే దీన్ని సాధ్యం చేసుకోవడానికి ఈ ఐదు విజయ రహస్యాలను తెలుసుకోండి.
వేకువజామున 4 గంటలకే నిద్రలేచి పళ్లు తోముకొని చిలిగా ఉన్నా స్థానం చేయండి.
5 గంటలకు అమ్మను నిద్రలేపండి. కాఫీ లేదా టీ ఇస్తారు తాగండి.
5.30 గంటలకు టీవీ పెట్టండి. ఏదో ఆథ్మాత్మిక కార్యక్రమాన్ని చూసి మనస్సును రిలాక్స్ చేసుకోండి.
6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరండి.
5.6.30 గంటలకల్లా కాలేజీ చేరుకోవచ్చు. మీరే కాలేజీ ఫస్ట్. అర్థమయ్యిందా!!?
భారతీయ హీరోల బయోగ్రఫి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Subscribe to:
Post Comments (Atom)
ఓస్, ఇంత వీజీ నా...? నేనింకా కష్టమను కున్నా.. :)
ReplyDelete