Friday, November 13, 2009

2012 ప్రపంచ అంతం. నిజమేనా?

Friday, August 14, 2009

స్వతంత్ర దినోస్తవ శుభాకాంక్షలు

ప్రియతమ తెలుగు బ్లాగర్ లందరికి స్వతంత్ర దినోస్తవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోస్తవం రోజే నా జన్మదినం కావడం ఓ భారతియుడిగా నాకెంతో గర్వంగా ఉంది. జై హింద్. జై భారత్ మతాకే. సారే జహాన్ సే అచ్చ, హిందూసీతా హమారా , హం బుల్ బులేన్హే ఇస్కి, ఏ గుల్సితాన్ హమారా హమారా . సారే జహాన్సే అచ్చ , హిందుసితాన్ హమారా హమారా. మీ షేక్ ఇలియాస్. شیخ - الیاس

Sunday, March 1, 2009

ఓటరులార జాగ్రత్త. మీ ఓటు హక్కు ఎలా ఉపయోగించాలో అన్న నందమూరి తారక రామారావు గారి మాటలలో

ఈ వీడియో ని ఇక్కడ నా బ్లాగ్ లో పొంద పరచడం లో నా ఉద్దేశం , రాబోయే ఎన్నికల్లో మన ఓటు హక్కును సరైన విధంగా ఉపయోగించాలని చెప్పడానికి మాత్రమే. ఏ రాజకీయ పార్టికి నా ముద్దతు తెలుపడానికి మాత్రం కాదు. వెన్ను పోటు పొడిచేవారితో జాగ్రత్తగా వేవహరించాలనికుడా ఇక్కడ చెప్పడం ఓ ఉద్దేశం. ఈ వీడియో లో ఉన్న నిజం, యెంత దాచిన దాగని పచ్చి నిజం.

Monday, January 26, 2009

గణతంత్ర దినోస్తవ హార్థిక శుభాకాంక్షలు.

హాస్య పందిరి పాఠకులందరికీ గణతంత్ర దినోస్తవ హార్థిక శుభాకాంక్షలు. మీ షేక్.ఇలియాస్

Wednesday, January 21, 2009

చిట్ట చివరి కోరిక ( ఓ చిన్న హాస్యపు కథ ) comedy story

అర్థ రాత్రి 12 గంటలు కావస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు లోని చెరసాల లో వున్న ఖైది కి నిద్ర పట్టడం లేదు, ఏవేవో అంతుపట్టని ఆలోచనలు, మనసంతా యమచిరగ్గా వుంది. తెల్లవారితే ఉరిశిక్ష. ఉరి బారి నుండి తప్పించుకొనే మార్గం ఏది లేదని తనకు తెలుసు, ఐన సరే ఉరిశిక్ష నుండి ఓ 5 రోజులైనా తప్పించుకోవాలనేది ఖైది పన్నాగం." ఉరి తీసే సమయం లో జడ్జి గారు తప్పకుండ ని చివరి కోరిక ఏమిటని అడుగుతారు కద, అప్పుడు నా ఈ 5 రోజుల ఉరిశిక్ష వాయిదా ప్రస్తావన జడ్జి ముందుంచితే సరి. అయన నా కోరికను తప్పకుండ ఒప్పుకుంటారు " అనుకున్నాడు ఖైది.
చెరసాల అవతలి వైపునుండి గాడ్జిల్ల లా అరుస్తూ వచ్చి ఖైది వున్న చెరసాల వద్ద అగ్యాడు పోలీస్ అధికారి. ఖైదినిద్రించనిది గమనించి " ఏరా గుట్లే.ని కింక నిద్ర పట్టలేదా? " అన్నాడు. ఖైది కి ఎక్కడో చర్రున కాలింది. " ని యంకమ్మా. నీకు నా పరిస్తితి వచ్చి ఉంటే తెలిసేదిర నాకు యందుకు నిద్దర పట్టడం లేదో " అనుకున్నాడు తన మనసులో ఖైది. ఏరా వెధవ కరెంటు షాక్ కొట్టిన కోతిలా అయపోయావ్, ఏమైంది నీకు? నా ప్రశ్నకు జవాబివ్వవ? అన్నాడు పోలీస్అధికారి. బ్రహ్మానందం లా కసరుకున్నాడు ఖైది." ఓర్ని, తెల్లవారితే ఉరికంబం ఎక్కేవాడివి నికింత పోగుర " అనుకుంటూ అల్లురామలింగయ్య స్టైల్ లో నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు పోలీస్ అధికారి. తెల్లవారింది. డాక్టర్ ఖైది వద్దకు వచ్చి తనను పరసిలించి " అంత ఓకే " ఉరికంబం ఎక్కించడమే తరువాయే అన్నాడు జడ్జి గారితో. ఐతే ఓకే అన్నారు జడ్జి గారు. ఖైది ని చేర్చాల్సిన చోటుకి చేర్చండని పోలీసులకు ఆదేశాలు జారి చేసారు. కట్... కట్....... స్తలం: ఖైదిలకు ఉరితిసే చోటు జడ్జి ఖైదినుద్దేసించి: ని చివరి కోరిక ఏంటి? ఖైది: సార్ నేనింక 5 రోజులు జీవించాలని ఆశిస్తున్నాను. యమలీల సినిమాలోని యముడి పాత్రలో ఉన్నా సత్యనారాయణ లా డైలాగ్ ఆన్దుకున్నారు జడ్జి గారు " అది కుదరదునాయినా, ఇంకేమైనా కోరుకో. ఖైదికి జడ్జి గారి జవాబుతో ఏంచేయాలో దిక్కుతోచలేదు. విసుగ్గా తను తోడుకున్న నిక్కర్ జేబులో చెయ్ వేసిపిసుక్కున్నాడు. నిక్కర్ జేబులో ఏదో చేయేకి తాకింది. దాన్ని బయటికి తీసి చూసాడు ఖైది, అది మింటో చాక్లెట్. తననుసందర్శించడానికి వచ్చిన తన స్నేహితుడు ఇచ్చిన చాక్లెట్ అది. దాన్ని తీసి నోట్లో వేసుకున్నాడు ఖైది. మేరుపైనఆలోచన తన మేదుడుకు తట్టింది. తక్షణం జడ్జి వైపు చూసాడు ఖైది " సార్ సార్ నా చివరి కోరిక. జడ్జి: చెప్పు ని చివరి కోరిక ఏంటో? ఖైది: మరేంలేదు సార్. "నన్ను తలకిందలుగా ఉరి తీయండి చాలు " అన్నాడు ఖైది మెరుపు వేగంతో. జడ్జి గారు;????????????????????????? గమనిక: ఇది నా మొదటి హాస్య కథ. కథ ఎలాఉందో దయచేసి తెలుప గలరు. మీరిచ్చే సలహాలు, సూచనలు, మీఅభిప్రాయాలూ నా కెంతో విలువైనవి. విమర్శకులకు స్వాగతం. కథ చదివి నందుకు మీకు నా ధన్యవాదాలు. మీ షేక్.ఇలియాస్

Sunday, January 18, 2009

మిమిక్రి చూసి చాలా రోజులయిందా? ఐతే చుడండి శివా రెడ్డి మిమిక్రి. మీరు నవ్వకుండా ఉండలేరు. ఇది నా హమి ( mimicry )

రోజు పని. దొరికేది ఒక రోజు సెలవు. వారం మొత్తం ఆఫీసు లో పని చేసి అలసిపోతాం. దొరికిన సెలవు రోజు వారం మొత్తం మనం పొందలేక పోయిన ఆనందాన్ని, ఆల్హదాన్ని, సంతోషాన్ని పొందాలని ఆరాటపడతాం, దానికోసం పరితపిస్తాం. మొత్తానికి దొరికిన సెలవు రోజు ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటాం. అవునా కాదా? అవును కదు! అదిగో అలాంటి ఆనందాన్ని నా వంతూ ఏదో కొంతైనా మీకు అందించాలని ఇక్కడ తెలుగు సినిమా 75 వజ్రోస్తవాల్లో శివా రెడ్డి చేసిన మిమిక్రి తాలుకు వీడియో ఇక్కడ పొందపరుస్తున్నాను. ఇందులో శివారెడ్డి చేసిన మిమిక్రి అద్భుతం, అమోఘం. మనందరం కుటుంబ సమేతంగా చూడదగ్గ మిమిక్రి. ఎన్.టి.రామారావు హిందీ పాట " ఏక్ బార్ ఆజా " కి తనదైన సహజ శైలి లో స్టెప్పులతో వేస్తె ఎలాఉంటుంది? అక్కినేని నాగేశ్వరరావు గారు అరబీ రీమిక్స్ పాటకీ తన స్టైల్ లో గంతేస్తే ఎలాఉంటుంది? సూపర్ స్టార్ కృష్ణ వెరైటి వెరైటి గా ఆడి పడితే ఎలాఉంటుంది? యర్రన్న ఆర్.నారాయణ మూర్తి హిందీ పాట " గజరారే గజరారే మేరె కాలే కాలే నైన " కి ఎర్ర శాలువా పట్టుకొని కొమ్రేడ్ లెవెల్లో డాన్స్ చేస్తే? చెబుతూ పొతే చాలానే ఉంది ఇందులో. వీడియో కి చూపు చుడండి తెలిసి పోతుంది. మిమిక్రి చుసిన పిదప, పిమ్మట ఇందులో నవ్వుకోడానికి ఆస్కారం లేకపోతె మీరు నా మీద పెన్ను చేసుకోవచ్చును. మారేందుకు అలేస్యం పదండి మిమిక్రి sinimaki

Friday, January 16, 2009

హైదరాబాద్ లో జరిగిన పుస్తక ప్రదర్శనలోని మన తెలుగు బ్లాగ్ స్టాల్ ఫోటోలు మనందరికోసం

హైదరాబాద్ లో జరిగిన పుస్తకప్రదర్శనలో, మన తెలుగు బ్లాగ్ వారు ఓ స్టాల్ ని నిర్వహించారు . దానికి సంభదించిన కొన్ని ఫోటో లు మనదరికి గుర్తుండాలని. ఈ స్లైడ్ షో ఇక్కడ పొందపరుస్తున్నాను.

Wednesday, January 14, 2009

సంక్రాంతి

Monday, January 12, 2009

కోతుల నిరసన

ముంబాయి జూ పార్క్ లోని కోతులన్నీ గుంపగా చేరి తమ నిరసన తెలుపుతున్నాయి. జూ అధికారి విషయం ఎమిటని విచారించగా "తమని ఎవరో Symond అన్నారని, అ మాట వెనక్కి తీసుకునేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని " తేలిసింది

Sunday, January 11, 2009

టపా వ్రాసి చాలరోజులయ్యంది

నా బ్లాగ్ పాఠకులందరికీ వందనం,ఆదాబ్. new year కి నా బ్లాగ్ ని అందంగా తీర్చిదిద్దాలని ఆశతో నా బ్లాగ్ లో టపా వ్రాయడం కాస్త అలేస్యం అయ్యంది. అలాగే ఈ మధ్యన ఉర్దూ బ్లాగ్ వ్రాయడం మొదలుపెట్టాను, ఉర్దూ బ్లాగ్ ని తీర్చి దిద్దడానికి కాస్త సమయం పట్టింది. ఉర్దూ బ్లాగ్ ఇంక నిర్మాణ దశలోనే ఉంది. ఉర్దూ ని అదే పదాలతో తెలుగు భాష లో కూడా అక్కడే వ్రాస్తున్నాను, ఇంగ్లీష్ లో కూడా వ్రాస్తున్నాను. ఈ బ్లాగ్ లో గజల్ మరియు శాయరిలు ( కవితలు ) వ్రాస్తున్నాను. దిని చిరునామా http://eliyas-urdughar.blogspot.com 2009 లో ఇదేనా మొదటి టపా. ఇకనుంచి తరచూ తప్పకుండ టపాలు వ్రాస్తూఉంటాను. నా బ్లాగ్ కొత్త అందం ఎలాఉందో మీరు చెప్పగలరు. సరే ఉంటాను , ఇకనుంచి కాస్కో నా సామిరంగా. మిమ్మల్ని నవ్వించడానికి త్వరలో ఓ కొత్త టపా తో మీ ముందుంటాను. మీ షేక్.ఇలియాస్