అర్థ రాత్రి 12 గంటలు కావస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు లోని చెరసాల లో వున్న ఖైది కి నిద్ర పట్టడం లేదు, ఏవేవో అంతుపట్టని ఆలోచనలు, మనసంతా యమచిరగ్గా వుంది. తెల్లవారితే ఉరిశిక్ష. ఉరి బారి నుండి తప్పించుకొనే మార్గం ఏది లేదని తనకు తెలుసు, ఐన సరే ఈ ఉరిశిక్ష నుండి ఓ 5 రోజులైనా తప్పించుకోవాలనేది ఆ ఖైది పన్నాగం." ఉరి తీసే సమయం లో జడ్జి గారు తప్పకుండ ని చివరి కోరిక ఏమిటని అడుగుతారు కద, అప్పుడు నా ఈ 5 రోజుల ఉరిశిక్ష వాయిదా ప్రస్తావన జడ్జి ముందుంచితే సరి. అయన నా కోరికను తప్పకుండ ఒప్పుకుంటారు " అనుకున్నాడు ఆ ఖైది.
చెరసాల అవతలి వైపునుండి గాడ్జిల్ల లా అరుస్తూ వచ్చి ఈ ఖైది వున్న చెరసాల వద్ద అగ్యాడు ఓ పోలీస్ అధికారి. ఖైదినిద్రించనిది గమనించి " ఏరా గుట్లే.ని కింక నిద్ర పట్టలేదా? " అన్నాడు. ఖైది కి ఎక్కడో చర్రున కాలింది. " ని యంకమ్మా. నీకు నా పరిస్తితి వచ్చి ఉంటే తెలిసేదిర నాకు యందుకు నిద్దర పట్టడం లేదో " అనుకున్నాడు తన మనసులో అ ఖైది. ఏరా వెధవ కరెంటు షాక్ కొట్టిన కోతిలా అయపోయావ్, ఏమైంది నీకు? నా ప్రశ్నకు జవాబివ్వవ? అన్నాడు అ పోలీస్అధికారి. బ్రహ్మానందం లా కసరుకున్నాడు ఖైది." ఓర్ని, తెల్లవారితే ఉరికంబం ఎక్కేవాడివి నికింత పోగుర " అనుకుంటూ అల్లురామలింగయ్య స్టైల్ లో నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు అ పోలీస్ అధికారి.
తెల్లవారింది. డాక్టర్ ఖైది వద్దకు వచ్చి తనను పరసిలించి " అంత ఓకే " ఉరికంబం ఎక్కించడమే తరువాయే అన్నాడు జడ్జి గారితో. ఐతే ఓకే అన్నారు జడ్జి గారు. ఖైది ని చేర్చాల్సిన చోటుకి చేర్చండని పోలీసులకు ఆదేశాలు జారి చేసారు. కట్... కట్.......
స్తలం: ఖైదిలకు ఉరితిసే చోటు
జడ్జి ఖైదినుద్దేసించి: ని చివరి కోరిక ఏంటి?
ఖైది: సార్ నేనింక ఓ 5 రోజులు జీవించాలని ఆశిస్తున్నాను.
యమలీల సినిమాలోని యముడి పాత్రలో ఉన్నా సత్యనారాయణ లా డైలాగ్ ఆన్దుకున్నారు జడ్జి గారు " అది కుదరదునాయినా, ఇంకేమైనా కోరుకో.
ఖైదికి జడ్జి గారి జవాబుతో ఏంచేయాలో దిక్కుతోచలేదు. విసుగ్గా తను తోడుకున్న నిక్కర్ జేబులో చెయ్ వేసిపిసుక్కున్నాడు. నిక్కర్ జేబులో ఏదో చేయేకి తాకింది. దాన్ని బయటికి తీసి చూసాడు ఖైది, అది మింటో చాక్లెట్. తననుసందర్శించడానికి వచ్చిన తన స్నేహితుడు ఇచ్చిన చాక్లెట్ అది. దాన్ని తీసి నోట్లో వేసుకున్నాడు ఖైది. ఓ మేరుపైనఆలోచన తన మేదుడుకు తట్టింది. తక్షణం జడ్జి వైపు చూసాడు ఖైది " సార్ సార్ నా చివరి కోరిక.
జడ్జి: చెప్పు ని చివరి కోరిక ఏంటో?
ఖైది: మరేంలేదు సార్. "నన్ను తలకిందలుగా ఉరి తీయండి చాలు " అన్నాడు ఖైది మెరుపు వేగంతో.
జడ్జి గారు;?????????????????????????
గమనిక: ఇది నా మొదటి హాస్య కథ. ఈ కథ ఎలాఉందో దయచేసి తెలుప గలరు. మీరిచ్చే సలహాలు, సూచనలు, మీఅభిప్రాయాలూ నా కెంతో విలువైనవి. విమర్శకులకు స్వాగతం.
కథ చదివి నందుకు మీకు నా ధన్యవాదాలు. మీ షేక్.ఇలియాస్
concept is good but looks like stretched. Keep improve yourself to involve the reader more interestengly.
ReplyDeleteVery good attempt. Keep practicing.
ReplyDeleteAll the best
జోకు బాగానే పేలింది. పైన వారు చెప్పినట్లు.. ఇంకొచెం నిడివి తగ్గిస్తే ఇంకా బావుంటుంది.
ReplyDeleteమింటో ఐడియా సూపర్ :)))
please remove 'word verification' option.
ReplyDelete:) బాగుందండి.
ReplyDeleteఇక్కడ నా కథ కి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు. తప్పకుండ మీ సలహాలు మరియు సూచనలు ఉపయోగిస్తాను.
ReplyDelete