Wednesday, October 22, 2008

ఏదో ఒక కుక్క మొరిగిందీ వేళా

పేరడీ పాట హాస్యం కోసం. పాట: ఏదో వక రాగం పిలిచిందీ వేళ చిత్రం: రాజా పల్లవి: ఏదో వక కుక్క మొరిగిందీ వేళా ఉళ్లో కుక్కలన్నీ విన్నవి ఆ గోల ఈ కుక్క మొరిగెనులే, అవికూడా మొరిగెనులే కుక్క బాధ కుక్కలదే మనుషుల బాధ మనుషులకే "ఏదో" చరణం: ఇజ్జో అని అంటే ఉరికిన జ్ఞాపకమే చూ అని అంటే కొరికిన జ్ఞాపకమే పాడు బడిన ఇళ్లలొ పండిన జ్ఞాపకమే ఇంటికొచ్చే దొంగలను కరిచే జ్ఞాపకమే నోటికొచ్చినట్లు తిడితే చూసే జ్ఞాపకమే "ఏదో" చరణం: మురికి కు0టలలో దొర్లిన జ్ఞాపకమే రొచ్చు గుంతలనే దాటినా జ్ఞాపకమే వీధి చివరి దొడ్లలొ తిన్నది జ్ఞాపకమే రాత్రి పగలు లేకుండా అరిచే జ్ఞాపకము అలుపు సొలుపు లేకుండా తెరిగే జ్ఞాపకము "ఏదో" ఒక ముఖ్య గమనిక: ఇ పాట ఓ ప్రముఖ దినపత్రిక నుండి సేకరించడం జరిగింది. దీనిని వ్రాసిన వారు ఎం.విజయ్ కుమార్, గూడూరు. ఇలాంటి తమాషా పేరడీ వ్రాసినందుకు విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. షేక్ ఇలియాస్

1 comment:

thanks to comment on my blog.