Sunday, October 19, 2008

అమ్మాయిని ఆకర్షించడం ఎలా?

తనింటి ముందు కొత్తగా అద్దే ఇంట్లోకొచ్చిన సుకంన్యను చూసి ప్రసాద్ మనసు ప్రేమించాలనే చిత్ర విచిత్రమైన కోరిక కలిగింది. రేండునెలలు తన చూపులతో సుకంన్యను మింగేసేలా చూసే వాడు, కానీ సుకన్య నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కుదరదని ఏదో వకటి చేసి సుకన్య ను ప్రేమలో పడగొట్టాలని అనుకున్నాడు ప్రసాద్. "అమ్మాయిని ఆకర్షించడం ఎలా?" అనే పుస్తకం కొని దానిలోని చిట్కాలన్నీ ఉపయోగించాడు, కానీ సుకన్య నుండి ఎలాంటి స్పందన రాలేదు. ప్రసాద్ సహనం నశించింది, సుకన్య ఇంటికి వెళ్లి తాడో పేడో తెల్చుకోవాలనుకున్నాడు ప్రసాద్. ఆ రోజే సుకన్య ఇంటికి వేల్యాడు ప్రసాద్, ఇంటిలోపల హాల్ లో ఎవరు కనిపించ లేదు. బల్ల మిద ఓ పుస్తకం కనిపించింది, ప్రసాద్ ఆ పుస్తకం మిద ఉన్నా శర్షిక చూసి తల జుట్టు పికొంటు అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇంతకీ ఆ పుస్తకం ఎంటి ? " అబ్బాయిల ఆకర్షననుండి తప్పించుకోవడం ఎలా? " అబ్బాయి గారు , అమ్మాయి గారు , దయచేసి ఈ జోక్ మిద మీ అభిప్రాయాలూ వ్రాయండి .

3 comments:

  1. బాగుంది, మీకు బ్లాగు రాయాలన్న ఆ 'మహా ఇష్టం' ఎప్పటికి వాడిపోని పువ్వులా పరిమళించాలని కోరుకుంటూ..
    మీరు మీ బ్లాగ్ టైటిల్ కింద రాసిన దానిలో చాలా తప్పులున్నాయి.
    ఆ తప్పుల్ని సరిచేసాను, నచ్చితే తీసుకోండి.

    ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఆదాబ్. నా పేరు షేక్ ఇలియాస్, ఊరు బీ. కొత్త కోట, చిత్తూరు జిల్లా. ప్రస్తుతం నేను బెంగుళూరులో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నాకు బ్లాగు వ్రాయడమంటే మహా ఇష్టం. నాలో కలిగే ఎన్నో ఆలోచనలకు ఇక్కడ అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి ప్రారంభమే ఈ "హాస్య పందిరి". ఇక్కడ ప్రోత్సాహం లభిస్తే నా ఆలోచనలు వ్రాయడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ శెలవు తీసుకుంటున్నాను.
    - ప్రేమతో షేక్ ఇలియాస్


    - కిరణ్
    ఐతే OK

    ReplyDelete
  2. మిత్రమా మీరు రాసిన కథ చాలా బాగుంది . ఇలాంటి హాస్యభరితమైన కథలింక రాయాలని కోరుకుంటు మీ మిత్రడు బి. సత్య నారాయన గౌడ్.బండకాడి

    ReplyDelete
  3. అందరు ఇలా బ్లాగులు పెట్టి సుత్తి కొడుతారు... కాని అమ్మాయిలను ఆకర్షించడం ఎలా అనేది మాత్రం చెప్పరు. ఆకర్షించడమంటే ఒక కళ... అది జన్మతః రావాలి... కాని ఇలా టిప్స్ తో రాదనేది నా అభిప్రాయం....

    ReplyDelete

thanks to comment on my blog.